Monday, April 29, 2024

Heavy Rains: వీడ‌ని వాన‌.. 21జిల్లాల్లో స్కూళ్లు బంద్

తమిళనాడును వానగండం వీడ‌డం లేదు. ఇప్పటికే భారీ వాన‌లు, వరదలతో చెన్నై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మరోసారి తమిళనాడు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాన‌ముప్పు ఎక్కువ‌గా ఉండే 21 జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణీపేట్, దిండుగల్, పుదుకొట్టై, నాగపట్నం, వేలూరు, తిరువరూర్‌తో సహా మరికొన్ని జిల్లాల్లో గురువారం స్కూళ్లు, కాలేజీలను బంద్ చేశారు.

భారీ వర్షాలు పడుతుండటంతో అలర్ట్ అయిన చెన్నై కార్పొరేషన్.. అధికారులతో కలసి వార్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సిటీలో పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తోంది. వరద ముంపు ప్రాంతాల‌ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సీఎం స్టాలిన్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ.. అధికారుల‌ను నిరంత‌రం అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement