Thursday, May 2, 2024

Water Matters: జూరాలకు భారీగా ఇన్​ఫ్లో.. 37 గేట్లు ఓపెన్​ చేసి దిగువకు నీటి విడుదల

కర్నాటక, ఆ ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. దీంతో కన్నడ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. కాగా, తెలంగాణలో జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వస్తున్న ఇన్​ఫ్లోలతో ప్రాజెక్టు తొణికిసలాడుతోంది. దీంతో ఇన్​ఫ్లోల ఆధారంగా జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలం డ్యామ్​కి నీటిని విడుదల చేస్తున్నారు.

ఇవ్వాల (ఆదివారం)  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.85 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు నుంచి దిగువకు 1.91 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో కుడి, ఎడమ హైడల్​ పవర్​కు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 8.98 టీఎంసీలు కాగా, లైవ్​ కెపాసిటీ 5.28 టీఎంసీలుగా ఉంది. 37 స్పిల్​ వే గేట్లు ఓపెన్​ చేసి 1.52 లక్షల క్యూసెక్కుల నీటిని రిలీజ్​ చేస్తున్నారు. పవర్​ హౌస్​కి 36వేల క్యూసెక్కులు, కోయిల్​ సాగర్​ 315, లెఫ్ట్​ మెయిన్​ కెనాల్​ 920, రైట్​ మెయిన్​ కెనాల్​, 640, ప్యారలాల్​ కెనాల్​ 350, భీమా–2కు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement