Monday, May 6, 2024

ఆరోగ్య తెలంగాణని నిర్మించాం- మంత్రి గంగుల కమలాకర్

దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది
మహిళలకు మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఉచితంగా కాన్పు చేసి. ఇంటివద్ద దిగబెడుతున్నాం అని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు.వ్యాధి ముదరకముందే… ప్రతి 3 నెలల నుండి 6 నెలలకోసారి పరీక్షలు చేయించుకోవాలి..కరోనాని అరికట్టడంలో కరీంనగర్ జిల్లా ముందు స్థానంలో నిలిచిందన్నారు..కరోనా విజృంభిస్తున్న వేళ ఇంటింటికీ జ్వరసర్వే నిర్వహించి… కరోనా కిట్ లు ఉచితంగా అందించాం…కరోనా మొదటి డోస్ టీకాలను 106శాతం పంపిణీలో జాతీయ స్థాయిలో 4వ స్థానం… దక్షిణ భారతదేశంలో 2వ స్థానంలో నిలిచాం..ముందస్తు జాగ్రత్తగా 12 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకు టీకాలు వేస్తున్నాం
తెలంగాణ ప్రజలకు సంపూర్ణవంతమైన ఆరోగ్యాన్నివ్వడమే లక్ష్యం..ప్రభుత్వాసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాం… ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement