Tuesday, April 30, 2024

Flash: హోటల్లో భారీ పేలుడు.. 22 మంది మృతి

క్యూబాలోని హవానాలో ఉన్న ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. సరటో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో  శుక్రవారం ఉదయం శక్తివంతమైన పేలుడు చోటుచేసుకున్నది. దీంతో 22 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి హోటల్‌లోని ఐదు అంతస్తులు ధ్వంసమయ్యాయి. హోటల్‌ బయట ఉన్న బస్సులు, కార్లు దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గ్యాస్ లీకేజీగా కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement