Monday, April 29, 2024

హర్యానాలో నైట్ కర్ఫ్యూ

దేశంలో మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాకట తదితర రాష్ట్రాల్లో రాత్రివేళ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా సైతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.  కొన్ని రోజుల తరువాత పరిస్థితి అంచనా వేసి, తరువాత రాత్రి కర్ఫ్యూను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. మేరకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొంది.

ఈ ఉత్తర్వులో పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది, మిలిటరీ లేదా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వంటి ఫ్రంట్లైన్ కార్మికులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభిస్తుందని హర్యానా హోం మరియు ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు.

రాత్రి వేళల్లో ప్రయాణించాలనుకునే ఎవరైనా కర్ఫ్యూ పాస్ పొందాలి. అంతర్-రాష్ట్ర రవాణాపై ఎటువంటి నిషేధం ఉండదు. రాత్రి కర్ఫ్యూ సమయంలో, ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్స్ మరియు ఎటిఎంలు తెరిచి ఉంటాయి. కాగా,  హర్యానాలో ఆదివారం కొత్తగా 16 కరోనా మరణాలు సంభవించాయి. 3,440 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 3268కి చేరగా, కేసుల సంఖ్య 3,16,881గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement