Wednesday, May 1, 2024

మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

నేడు మదర్స్ డే సందర్భంగా సెలెబ్రిటీలంతా తమ తల్లుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. తల్లులందరికీ అభివందనములు.. ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అంటూ చిరంజీవి ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ తమ తల్లి అంజనా దేవితో షూటింగ్ లొకేషన్ లో భోజనం చేస్తూ.. ఆమెని కారు ఎక్కిస్తున్న అందమైన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో బ్యాగ్రౌండ్ లో వకీల్ సాబ్ చిత్రంలోని పాట మ్యూజిక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ వీడియో ఎమోషనల్ గా ఉంటూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎక్కడో షూటింగ్ లొకేషన్ లోనే వీరంతా తమ తల్లితో ఉన్నారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పంచె కట్టులో కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement