Thursday, May 2, 2024

ఖైరతాబాద్‌ గణనాథుడికి గవర్నర్‌ తొలిపూజ

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  పండుగతో భాగ్యనగరంలో సందడిగా మారింది.  విఘ్నాలు తీర్చే వినాయకుడు హైదరాబాద్ నగరమంతా కొలువుదీరుతున్నాడు. కరోనాతో గతేడాది కళ తప్పిన వినాయక చవితి సంబురం ఈ సారి కోలాహలంగా జరుగుతోంది. వినాయక చవితి అంటే ముందుగా గుర్తు వచ్చేంది ఖైరతాబాద్ లంబోదరుడు. ఈ సారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు.  40 అడుగుల అడుగుల ఎత్తులో ఉన్న పంచముఖ రుద్ర మహాగణపతిని దర్శనమిస్తున్నాడు. వినాయకుడి కుడిమైపు నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు ఉన్నారు. చవితిని పురస్కరించుకుని మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌదరరాజన్‌, హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొంటారు.

ఇది కూడా చదవండిః జై జై గణేశా.. వినాయక చవితి విశిష్టత ఇది!

Advertisement

తాజా వార్తలు

Advertisement