Thursday, April 25, 2024

దళితుల భూమి.. దర్జాగా కబ్జా..!

దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల అభ్యున్నతి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జలగం వెంగళరావు కాలంలో ప్రభుత్వం ఖానాపురం వద్ద ప్రస్తుతం ఉన్న ఎన్‌ఎస్‌పీ ఆఫీసర్‌స్ గెస్ట్‌ హౌజ్‌కు ఎదురుగా కేటాయించిన 2.36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు దర్జాగా కబ్జా చేశారు. ఖానాపురం సర్వే నెంబర్‌ 285/ఆ లో చిన్న తరహా రైతుల అభివృద్ధి సంస్థ(స్మాల్‌ ఫార్మర్స్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) పేరుతో 1977లో ఏర్పాటు కాబడిన శ్రీ వెంకటరామా షెడ్యూల్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ కో-ఆపరేటివ్‌ ఫౌల్ట్రి, పిగ్గెరీ సొసైటీకి అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ భూమిని కేటాయించింది. దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆ భూమిని కొందరు అగ్రవర్ణాల వారు కుట్రకోణంలో, అడ్డదారుల్లో కాజేసి తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని పార్టీషన్‌ డీడ్‌ల పేరుతో పంపకాలు చేసుకోవడం విశేషం. కబ్జా, దొంగ రిజిస్ట్రేషన్ల తీరుపై ఆంధ్రప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మం నగరానికి సమీపంలో గతంలో ఖానాపురం హవేలి గ్రామ పంచాయతీ, ప్రస్తుతం ఖమ్మం కార్పోరేషన్‌ పరిధిలోని 5వ డివిజన్‌ ఖానాపురం ఎన్‌ఎస్‌పి ఆఫీసర్స్‌ గెస్ట్‌ హౌజ్‌ ఎదురు రోడ్డులో 1977లో అప్పటి ప్రభుత్వం 2.36ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్సీ, బీసీ అట్టడుగు వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధి కోసం కేటాయించింది. దళితులు, ఆణగారిన వర్గాలుగా ఉన్న బడుగుల అభ్యున్నతే లక్ష్యంగా ఖానాపురం సర్వే నెంబర్‌ 285/ఆ లో చిన్న తరహా రైతుల అభివృద్ధి సంస్థ(స్మాల్‌ ఫార్మర్స్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) పేరుతో ఏర్పాటు కాబడిన శ్రీ వెంకటరామా షెడ్యూల్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ కో-ఆపరేటివ్‌ ఫౌల్ట్రిd, పిగ్గెరీ సొసైటీకి 1977లో ప్రభుత్వం కేటాయించిన భూమిలో పందులు, కోళ్ల పెంపకం ద్వారా రైతులు ఆర్ధిక పరిపుష్టిని సాధించాల్సి ఉంటుంది. ఆ భూమిపై కొందరు అగ్రవర్ణాలకు చెందిన ఆసాముల కన్ను పడడంతో కుట్ర కోణం లో, తప్పుడు మార్గాల్లో దర్జాగా కబ్జా చేసి కంచె వేసి హాంఫట్‌ అన్నట్లుగా మాయం చేసే ప్రయత్నాలు చేస్తూ దళితులు, అట్టడుగు వర్గాల పొట్ట కొడుతుండడం విశేషం.

ఖానాపురంలో 2.36ఎకరాలకు దొంగ రిజిస్ట్రేషన్లు :

దళితులు, ఆట్టడుగు వర్గాల బీసీలకు కేటాయించిన ఆ ప్రభుత్వ స్థలంలో కొంత కాలంపాటు కోళ్లు, పందుల పెంపకం సజావుగానే సాగింది. కాల క్రమేణా ఆయా వర్గాల వారిని బెదిరింపులకు గురిచేసి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను లోబర్చుకుని 2.36 ఎకరాల శ్రీ వెంకటరామా షెడ్యూల్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ కో-ఆపరేటివ్‌ ఫౌల్ట్రిd, పిగ్గెరీ సొసైటీ భూమిని కబ్జా కోరులు దర్‌జగా కబ్జా చేశారు. కబ్జా చేయడంతో పాటు కాగితాలు, పత్రాలు తారుమారు చేసి రెవెన్యూలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకుని దర్జాగా పహాణీ పత్రాలు సృష్టించారు. తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అడ్డదారుల్లో అనుభవించే ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. కంచె చేను మేసిన చందంగా అక్రమార్కులు, కబ్జా కోరుల నుండి కొందరు గతంలో పనిచేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారులు అందిన కాడికి ముడుపులు పుచ్చుకుని సహకారం అందించడంతో దళితులు, అట్టడుగు వర్గాల వారి భూమి అగ్రవర్ణాల కబంధ హస్తాల్లో చిక్కింది. దళితులు, అట్టడుగు వర్గాల భూమిని సైతం వదలని రాబంధులపై ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- Advertisement -

కోఆపరేటివ్పౌల్ట్రిd, పిగ్గెరీ సొసైటీ రైతులకు శఠగోపం :

చిన్న తరహా రైతుల అభివృద్ధి సంస్థ(స్మాల్‌ ఫార్మర్స్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) పేరుతో 1977లో ఏర్పాటు కాబడిన శ్రీ వెంకటరామా షెడ్యూల్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ కో-ఆపరేటివ్‌ ఫౌల్ట్రిd, పిగ్గెరీ సొసైటీకి చెందిన భూమిని కబ్జా కోరులు ఆక్రమించి ఆ వర్గాల ప్రజలకు శఠగోపం పెట్టడం, కంచె వేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ఎంతో గొప్ప లక్ష్యంతో సొసైటీకి కేటాయించిన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమై అక్రమార్కుల వశం కావడంతో ఆయా వర్గాల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దళితులు, అట్టడుగు వర్గాల బీసీలు ఆందోళనకు దిగకముందే ప్రభుత్వం, అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని దళితులు, దళిత సంఘాలు, సకల జనుల చైతన్య వేధిక నాయకులు, బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పార్టీషన్డీడ్పేరుతో దర్జాగా అగ్రవర్ణాల భూ పంపకాలు :

ఖానాపురం సర్వే నెంబర్‌ 285/ఆ లో దర్జాగా కబ్జా చేసిన సొసైటీ భూమిని ఆ సొసైటీతో సంబంధం లేని అగ్రవర్ణాల వారు కొందరు కబ్జా చేసి కంచె వేయడం, తప్పుడు రికార్డులతో కాగితాలు తారుమారు చేయడంతో పాటు తమ వారసుల పేర్లతో రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు సిద్దం కావడం విశేషం. పార్టీషన్‌ డీడ్‌ పేర్లతో కాగితాలు సృష్టించి ఫేక్‌ పత్రాలతో కోట్ల విలువ చేసే స్థలాన్ని అప్పనంగా కాజేస్తున్నా.. సంబంధిత శాఖల అధికారులు కాని, ప్రభుత్వం కాని పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో దళితులు, అట్టడుగు వర్గాల బీసీలు, పందులు, కోళ్ల పెంపకం దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కబ్జా కోరుల ఆధీనంలోకి వెళ్లిన ఈ భూమిపై జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ, సహకార శాఖల అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

ఇది కూడా చదవండిః సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

Advertisement

తాజా వార్తలు

Advertisement