Sunday, April 28, 2024

వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 2022లో రాబోయే కొత్త‌ ఫీచర్స్ ఇవే..

యూజర్ల కోసం కొత్త‌ కొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది వాట్సాప్‌. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ అందివ్వ‌డంతోపాటు ప‌లు బ‌గ్స్‌ని ఫిక్స్ చేస్తోంది ఈ కంపెనీ.. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ యూజర్ల సంఖ్య 200 కోట్లు దాటింది. దాదాపు స్మార్ట్‌ఫోన్ యూజర్లంతా వాట్సప్ ఉప‌యోగిస్తుంటారు. సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌తో వాట్సాప్ పోటీ ఎదుర్కొంటున్నా.. యూజర్ల కోసం అనేక కొత్తకొత్త ఫీచర్స్ (WhatsApp New Features) తీసుకొస్తోంది.

ఇప్పటికే వాట్సప్ వెబ్‌లో ఇమేజ్ ఎడిటర్, డిసప్పియరింగ్ మెసేజెస్, వాయిస్ నోట్స్ ప్లేబ్యాక్ స్పీడ్ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని పరిచయం చేసింది వాట్సాప్‌. అంతేకాకుండా మరిన్ని ఫీచర్స్‌ని రిలీజ్ చేసేందుకు ట్ర‌య‌ల్స్ మొద‌లెట్టింది. వీటిని 2022 జ‌న‌వ‌రిలో అందించేందుకు ప్లాన్ చేస్తోంది.

Last seen: వాట్సప్‌లో లాస్ట్ సీన్ అవతలివారికి కనిపించాలా వద్దా అనేది యూజర్ ఇష్టం. ఒక సెట్టింగ్ మారిస్తే అవతలివారికి లాస్ట్ సీన్ కనిపించదు. కానీ, ఇకపై కొందరు యూజర్లకు మాత్రమే లాస్ట్ సీన్ కనిపించేలా కూడా చేయొచ్చు. అంటే సెలెక్టెడ్ కాంటాక్ట్స్‌కి లాస్ట్ సీన్ కనిపించకుండా చేయొచ్చు. ఈ ఫీచర్ 2022లో రాబోతోంది.

Sticker Maker: వాట్సప్ వెబ్‌లో ఇప్పటికే స్టిక్కర్ మేకర్ ఫీచర్ వచ్చింది. త్వరలోనే వాట్సప్ మొబైల్ యాప్‌లో కూడా స్టిక్కర్ మేకర్ ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ వస్తే వాట్సప్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి స్టిక్కర్లు తయారు చేయొచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Communities: గ్రూప్ ఛాట్స్‌ని స్ట్రీమ్‌లైన్ చేసేందుకు కమ్యూనిటీ ఫీచర్ రూపొందిస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ఇప్పటికే డిస్కార్డ్ యాప్‌లో కమ్యూనిటీ ఫీచర్ ఉంది. వాట్సప్ కూడా అలాంటి ఓ ఫీచర్‌ని తెచ్చే యోచ‌న చేస్తోంది. గ్రూప్ పైన అడ్మిన్‌కు మరింత కంట్రోల్ తీసుకొచ్చేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

- Advertisement -

Playback Controls : వాయిస్ నోట్స్ ప్లేబ్యాక్ స్పీడ్ ఫీచర్ వ‌చ్చింది. ఆడియో మెసేజెస్‌కు కూడా ఈ ఫీచర్ రానుంది. ఇతరుల నుంచి వచ్చే ఆడియో మెసేజెస్‌కు వాయిస్ నోట్స్‌కు కనిపించినట్టుగా 1.5X, 2X ప్లేబ్యాక్ స్పీడ్స్ కనిపిస్తాయి.

Reactions: వాట్సప్‌లో మెసేజ్ రియాక్షన్ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎవరైనా పంపిన వాట్సప్ మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రియాక్షన్ ఇవ్వొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఉంది. త్వ‌ర‌లోనే వాట్సాప్‌లోనూ ఇట్లాంటి ఫీచ‌ర్ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది వాట్సాప్‌.

Disappearing Messages: మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ కావడానికి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 7 రోజుల వరకు టైమ్ సెట్ చేసుకోవచ్చు. త్వరలో ఈ టైమ్ లిమిట్‌ను 90 రోజులకు పెంచేలా అప్‌డేట్ చేస్తోంది కంపెనీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement