Sunday, May 26, 2024

గ్యాస్ సిలిండ‌ర్ బ‌రువు త‌గ్గ‌నుందా ..!

గ్యాస్ సిలిండ‌ర్ పై కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. ఎల్ పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు ప్ర‌తి నెల వినియోగ‌దారుల‌కు షాక్ ని ఇస్తున్నాయి. ఎల్ పీజీ సిలిండ‌ర్ ని కొనాలంటే వెయ్యి రూపాయ‌లుగా ఉంది. అదే కమర్షియల్ సిలిండర్ కు రూ.2200 చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గ్యాస్ సిలిండర్ బరువును తగ్గించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స‌మాచారం. మహిళలు సిలిండర్ ట్రాన్స్ పోర్టేషన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందువల్ల సిలిండర్ బరువును తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రాజ్యసభలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement