Sunday, May 19, 2024

నేటి బంగారం ..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. జూలై 27న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 దిగి వచ్చింది. దీంతో బంగారం రేటు 10 గ్రాములకు రూ. 50,780కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా ఇదే దారిలో పయనించింది. రూ. 320 పడిపోయింది. తులం రేటు రూ. 46,580కు క్షీణించింది. బంగారం రేటు గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 300 పడిపోయింది. దీంతో సిల్వర్ రేటు రూ. 60,800కు తగ్గింది. వెండి ధర గత నాలుగు రోజుల్లో రూ. 800 మేర పడిపోయింది. బంగారం వెండి కొనాలని చూసే వారికి ఇది ఊరట కలిగించే అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు చెరోదారిలో పయనిస్తున్నాయి. బంగారం ధర క్షీణిస్తే.. వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.05 శాతం క్షీణించింది. 1716 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే వెండి రేటు అయితే జిగేల్ మంది. ఔన్స్‌కు 0.28 శాతం పైకి చేరింది. 18.59 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement