Thursday, May 2, 2024

పెరిగిన బంగారం , వెండి ధ‌ర‌లు

బంగారం,వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. రూ.350 పైకి చేరింది. దీంతో ఆర్నమెంటల్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 49,350కు చేరింది. బంగారం ధ‌ర పెరగడం ఇది వరుసగా రెండ రోజు. 2 రోజుల్లో పసిడి రేటు రూ. 750 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కేజీకి రూ. 1500 జంప్ కొట్టింది. దీంతో ఈ రేటు రూ. 74,200కు చేరింది. వెండి పెరుగుతూ రావడం ఇది వరుసగా మూడో రోజు. ఈ కాలంలో సిల్వర్ రేటు ఏకంగా రూ. 2,700 ర్యాలీ చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు పెరగడం వల్ల సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనంగా పరిగణించే బంగారం ధరలు పెరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు దాదాపు ఉండబోవని ప్రకటించిన విషయం విదితమే. అయితే బలమైన అమెరికా డాలర్ కారణంగా పసిడి రేట్లలో పెరుగుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవాలి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయని, అలాగే భౌగోళిక ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ రవి సింగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement