Saturday, May 18, 2024

నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర – త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు హైద‌రాబాద్ మార్కెట్ లో 24క్యారెట్ల గోల్డ్ రేట్ గ‌త రెండు రోజుల్లో ఏకంగా రూ.1360కి త‌గ్గింది.దాంతో 10 గ్రాముల బంగారం రేటు రూ. 51,110కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు కూడా దాదాపు రూ. 1250 దిగివచ్చింది. దీంతో తులం బంగారం ధర రూ. 46,850కు పడిపోయింది. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. జూలై 9న పసిడి రేట్లు నిలకడగానే కొనసాగుతున్నాయి. పైన పేర్కొన్న మార్కెట్ రేట్లే ఉన్నాయి. కాగా వీటికి తయారీ చార్జీలు, జీఎస్‌టీ వంటివి అదనం .ఇక పసిడి బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. గోల్డ్ రేటు పడిపోతే వెండి కూడా దిగివచ్చింది. సిల్వర్ రేటు గత రెండు రోజుల కాలంలో ఏకంగా రూ. 2,300 పతనమైంది. దీంతో కేజీ వెండి రేటు రూ. 62,400కు తగ్గింది. వెండి ప్రేమికులకు ఇది శుభవార్త అనే చెప్పుకోవాలి. ఇకపోతే హైదరాబాద్‌లో వెండి రేటు ఈరోజు ఎలా ఉందో గమనిస్తే.. స్వల్పంగా పెరిగింది. రూ.100 పెరుగుదలతో కేజీకి రూ. 62,500కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement