Sunday, May 19, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి ధర

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.300 తగ్గి రూ.46,200గా నమోదైంది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర అయితే రూ.330 తగ్గడంతో.. రూ.50,400గా ఉంది. అయితే వెండి ధర మాత్రం నేడు కాస్త పెరుగుదలను నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర రూ.300 పెరగడంతో.. కేజీ రేటు రూ.60,700గా నమోదైంది.గత వారం రోజులుగా చూస్తే మాత్రం బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. వారం కిందట జూలై 11వ తారీఖున బంగారం ధర రూ.46,950 వద్ద ఉంటే.. ప్రస్తుతం ఈ ధర రూ.46,200కి పడిపోయింది. అంటే రూ.750 మేర ధర తగ్గిపోయింది.

ఈ వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ధర పెరిగింది. మిగతా అన్ని రోజులు ధర తగ్గుతూనే ఉంది. ఇక 24 క్యారెట్ల విషయానికి వస్తే.. ఆ ధర కూడా జూలై 11న రూ.51,210గా ఉంటే.. ప్రస్తుతం రూ.50,400గా నమోదవుతోంది. ఈ ధర కూడా రూ.810 మేర తగ్గిపోయింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.300 తగ్గడంతో.. ఈ ధర అక్కడ రూ.46,200గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.50,400గా ఉంది. బంగారం తగ్గగా.. వెండి మాత్రం భారీగానే పెరిగింది. ఢిల్లీలో కేజీ వెండిపై రూ.600 మేర ధర పెరగడంతో.. ఈ రేటు రూ.55,600కు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement