Monday, May 6, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. కాగా నేడు కూడా వెండి ధర ఓ రేంజ్‌లో పెరిగింది. కేజీ వెండి రేటు హైదరాబాద్‌లో రూ.1000 పెరిగి రూ.61,400కు చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో నేడు కూడా స్థిరంగా రూ.46,750 వద్ద నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51 వేలుగా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.46,900 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.51,150గా నమోదవుతోంది. అయితే ఢిల్లీలో వెండి రేట్లు కేవలం రూ.200 మేర మాత్రమే పెరిగి రూ.55,200ను చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement