Thursday, May 23, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర‌-స్థిరంగా వెండి

బంగారం ధ‌రల్లో గ‌త కొన్ని రోజులుగా హెచ్చు త‌గ్గులు వ‌స్తున్నాయి. కాగా ఈ రోజు బంగారం…వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..తెలుగు రాష్ట్రాల్లో జూలై 22న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గింది. రూ. 440 మేర క్షీణించింది. దీంతో బంగారం ధర రూ. 50,180కు దిగి వచ్చింది. 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. ఇక ఆర్నమెంటల్ 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. రూ. 400 తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 46 వేలకు క్షీణించింది.

ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు నేడు స్థిరంగానే కొనసాగింది. కేజీకి రూ. 61 వేల వద్దనే కొనసాగుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా దాదాపు ఇదే రేట్లు ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధర తగ్గింది. రూ. 440 క్షీణతో రూ. 50,180కు దిగివచ్చింది.. బెంగళూరులో గోల్డ్ రేటు రూ. 420 పడిపోయింది. రూ. 50,250 వద్ద కదలాడుతోంది.చెన్నైలో కూడా పసిడి రేటు రూ. 420 తగ్గుదలతో రూ. 50,500కు దిగి వచ్చింది. ముంబైలో పుత్తడి రేటు రూ. 440 పడిపోయింది. దీంతో బంగారం ధర రూ. 50,180కు క్షీణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement