Tuesday, May 21, 2024

రెండు రోజుల్లో రెండు వేలు పెరిగిన బంగారం-దూసుకుపోతోన్న వెండి

రెండు రోజుల్లో రెండు వేలు పెరిగింది బంగారం ధ‌ర‌.. వెండి రేటు భారీగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం వెండి ధరలు పైపైకి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టడం వల్ల దేశీ మార్కెట్‌లో కూడా పసిడి రేటు పైపైకి చేరిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూలై 30న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో పసిడి రేటు రూ. 110 మేర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఇది వర్తిస్తుంది. దీంతో ఈ పసిడి రేటు రూ. 51,490కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. రూ. 100 పైకి చేరింది. దీంతో ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 47,200కు ఎగసింది. బంగారం ధరలు రెండు రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ కాలంలో పసిడి రేటు రూ. 810 మేర పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement