Monday, May 6, 2024

Gold Rate: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. నేటి రేట్లు ఇవీ

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. పసిడి ధర మరోసారి పడిపోయింది. అయితే, నిన్న తగ్గిన వెండి ధర.. ఈ రోజు మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.49,260కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.45,150కి చేరింది. ఇక, వెండి ధర మాత్రం ధర రూ.600 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,800కు చేరింది. 

విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,260గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,150గా నమోదైంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 65,800 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,600కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47300 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 61,900 వద్ద కొనసాగుతోంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,000 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,000గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 61,900కి చేరింది.

కోల్‌క‌త్తలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,100గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,400 గా ఉంది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,900కి చేరింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement