Friday, April 26, 2024

రెండో రోజు తగ్గిన బంగారం ధర..నేటి రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అయితే, వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 49,260కి చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 క్షీణతతో రూ. 45,150కు చేరింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. కేజీ వెండి ధర రూ. 66,300 వద్దనే స్థిరంగా ఉంది. 

విజ‌య‌వాడ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,260 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,150 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 66,300 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,600 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,010 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,010 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement