Friday, May 3, 2024

Gold Price: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. నేటి రేట్లు ఇవీ..

పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి.  నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. తాజాగా బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపుగా రూ.250 వరకు పెరిగింది. హైద‌రాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 50,350 కి చేరుకుంది. విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,150 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 50,350గా ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 52,670 కి ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement