Sunday, April 28, 2024

Gold Rate: పెరిగిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా..

పెళ్లిళ్ల మాసం కావడంతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం మార్కెట్ లో 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి, రూ. 49,220కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల ధర కూడా రూ.10 పెరిగి రూ. 45,120 వద్ద కొనసాగుతోంది. అయితే, వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం కిలో వెండి ధర రూ.65,100గా నమోదైంది.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,560గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.47,260 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.46,780గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement