Sunday, April 28, 2024

Gold price: బంగారం, వెండి ధరలు పైపైకి.. నేటి రేట్లు ఇవి

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. 

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.50,190కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.210 పెరుగుదలతో రూ.46,110కు ఎగసింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,700కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement