Friday, May 3, 2024

Good News: పసిడి ప్రియులకు మంచి ఛాన్స్… దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారిక శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ ఈరోజు భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 51,670కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ. 47,350కు చేరింది. ఇక వెండి ధర కూడా పసిడి దారిలో నడిచింది. వెండి రేటు ఏకంగా రూ.1500 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 71,900కు క్షిణించింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement