Monday, April 29, 2024

మీకు ఆతిథ్య‌మివ్వ‌డం సంతోషం – మంచువిష్ణు

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కుమారుడి వివాహవేడుక‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ వ‌చ్చారు మంత్రి పేర్ని నాని. ఈ సంద‌ర్భంగా న‌టుడు మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మీకు మా ఇంట్లో ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంగా ఉంది నాని గారు అని ఆయన ట్వీట్ చేశారు. ‘సినిమా టికెట్ల అంశంపై మీరు తీసుకున్న చొరవకు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రణాళికలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు అని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement