Sunday, April 28, 2024

పెళ్ళి కావ‌డం వ‌ల్లే అంత బాగా న‌టించా – హీరో రానా

పెళ్ళి కావ‌డం వ‌ల్లే అంత‌బాగా న‌టించాన‌ని తెలిపాడు హీరో రానా. ప‌వ‌ర్ స్టార ప‌వ‌న్ క‌ల్యాణ్ తో రానా క‌లిసి న‌టించిన చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమాలో పవన్ పాత్రకు సమానంగా రానా పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. రానాకు ఈ చిత్రంలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఆత్మాభిమానానికి సంబంధించి ఒక చిన్న క్లాష్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇదని చెప్పాడు. ఈ సినిమా చేయడానికి ముందు రెండేళ్ల పాటు తాను అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు. ఆరోగ్యం కుదురుకున్న తర్వాత తాను చేసిన తొలి చిత్రం ఇదేనని చెప్పాడు. ముంబైలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో కూర్చొని తాను ఈ సినిమాను చూశానని… వారి నుంచి వస్తున్న స్పందనను చూసి చాలా సంతోషం వేసిందని అన్నాడు. ఈ చిత్రంలో తనకు, సంయుక్త మీనన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారని చెప్పాడు. పెళ్లయిన వాడిని కావడం వల్లేమో సంయుక్తతో అంత బాగా నటించగలిగానని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం వెంకటేశ్ బాబాయ్ తో కలిసి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేస్తున్నామని వెల్ల‌డించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement