Saturday, May 18, 2024

KTR: ఉప్పల్‌లో జెన్‌ప్యాక్ట్‌ క్యాంపస్‌.. 15 వేలకుపైగా ఉద్యోగాలు

ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గతంలో కేవలం మాదాపూర్, హైటెక్‌ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం హైదరాబాద్ నలుమూలల విస్తరిస్తున్నాయి.  తాజాగా నేడు హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ క్యాంపస్‌ నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ జెన్‌ప్యాక్ట్‌ ఉప్పల్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగానే ఆదివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ క్యాంపస్‌ భూమి పూజ చేయనున్నారు.

‘జెన్‌ప్యాక్ట్‌ తమ గ్రిడ్‌ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఉప్పల్‌ క్యాంపస్‌కు భూమి పూజ జరగనుంది. దీంతో 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాల కల్పనను చేరుకోనున్నాం’ అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement