Tuesday, April 30, 2024

Big Story: గ్యాస్‌ రీఫిల్‌ దందా, స‌ప్లయ్ చేస్తే 30చార్జి అద‌నం.. నెలకు 2.70 కోట్లు వసూలు

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌ బ్యూరో : గ్యాస్‌ రీఫిల్‌ సరఫరాకు సంబంధించి దందా కొనసాగుతోంది. గ్యాస్‌ సరఫరా చేసే సమయంలో రూ. 30 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.. ప్రేమతో ఇస్తే తీసుకోవాలి తప్పిస్తే డిమాండ్‌ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ఇంట్లోకి గ్యాస్‌ తీసుకవస్తే ఇంటి యజమాని ప్రేమతో ఎంతిస్తే అంతా తీసుకోవాలి.. కానీ, రూ. 30 ఇవ్వాల్సిందేనని కొంత‌మంది బాయ్స్ డిమాండ్‌ చేస్తున్నారు.. అదేమని ప్రశ్నిస్తే అది అంతేనని తేల్చి చెబుతున్నారు. గ్యాస్‌ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. దానికితోడు అదనపు బాదుడు గ్యాస్‌ వినియోగదారులను ఇబ్బందులపాలు చేస్తోంది. డబ్బులు ఇవ్వని పక్షంలో గ్యాస్‌ సరఫరా ఆలస్యం చేస్తున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. గ్యాస్‌ సరఫరా దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. అదనంగా వసూలు చేస్తున్న విషయం పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో నెలకు రూ. 2.70కోట్లవరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందులో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సి ఉంది.

ఇప్పటికే గ్యాస్ సిలింబడ‌ర్‌ రీఫిల్ ధ‌ర 1052కు చేరింది. దీనికి తోడు గ్యాస్ బోయ్స్ వేస్తున్న చార్జీలు అద‌నంగా ఉంటుంన్నాయి. ఇంటికి గ్యాస్ సిలిండ‌ర్ తెచ్చిన వ్య‌క్తి 30రూపాయ‌లు ఇవ్వ‌కుండా క‌ద‌ల‌డం లేదు. ఇది అంతేనంటూ ద‌ర్జాగా రిప్ల‌య్ ఇస్తున్నారు. రోజురోజుకు గ్యాస్‌ ధర పెంచుతోంది కేంద్రం. దానికితోడు అదనపు భారం గ్యాస్‌ వినియోగదారులను ఇబ్బందుులపాలు చేస్తోంది. ప్రస్తుత ధర చూస్తే గ్యాస్‌ కన్న కట్టెల పొయ్యిలే నయమనే భావనలో మహిళలు ఉన్నారు. గ్యాస్‌ సరఫరా చేసే సంస్థల సిబ్బంది అదనంగా వసూలుు చేయడం పరిపాటిగా మారింది. ఎవరికైనా చెప్పుుకోండి డబ్బులు మాత్రం ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. లిప్ట్‌ లేని ఇంటికి మెట్ల పైనుండి వెళ్తే చాయ్‌ డబ్బులు ఇచ్చేందుకు మహిళలు ఇష్టపడతారు. రూ.10 ఇస్తే సరిపోతుంది. గ్యాస్‌ సరఫరా చేసే సమయంలో ఏకంగా రూ. 30 వసూలుు చేయడం దందాగా మారింది. కొన్ని సంవత్సరాలుగా అదనపు బాదుడు వీరికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇదేమని ప్రశ్నిస్తే మాత్రం సరఫరా ఆలస్యం చేస్తున్నారని కొంత‌మంది మహిళలు ఆరోపిస్తున్నారు.

నెలకు రూ. 2.70కోట్లు వసూలు..

గ్యాస్‌ సరఫరా సమయంలో అదనంగా వసూలు దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ప్రతినెల దాదాపుగా గ్యాస్‌ వినియోగదారులపై ఏకంగా రూ. 2.70కోట్ల భారం పడుతోంది. రంగారెడ్డి జిల్లాలో 6లక్షలకు పైగానే గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 30వేల వరకు ప్రతిరోజు రీఫిల్‌ చేయించుకుంటున్నారు. సగానికి పైగా వినియోగదారులు ప్రతినెల గ్యాస్‌ రీఫిల్‌ చేయించుకుంటుున్నారు. రీఫిల్‌ సమయంలో గ్యాస్‌ సరఫరా చేసే అన్ని సంస్థలకు చెందిన సిబ్బంది అదనంగా వసూలు చేయడం పరిపాటిగా మారింది. గ్యాస్‌ ధరలతో ఇబ్బందిపడుతున్నారు. దానికితోడు అదనంగా వసూలు చేయడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రంగారెడ్డి జిల్లా పరిధిలోనే నెలకు రూ. 2.70కోట్లు వసూలు చేస్తున్నారంటే ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..అదనంగా ఎందుకు డబ్బులు ఇవ్వాలని మహిళలు ప్రశ్నిస్తే ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే మాత్రం గ్యాస్‌ సరఫరా ఆలస్యం చేస్తున్నారు.

ఇందులోఎవరి వాటా ఎంతో?…

- Advertisement -

గ్యాస్‌ సరఫరా చేసే సమయంలో అదనంగా వసూలు చేసే డబ్బులు కోట్లలో ఉంటున్నాయి. ఇందులో ఎవరి వాటా ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. గ్యాస్‌ కు సంబంధించిన వ్యవహారాలు పౌరసరఫరాల శాఖ చూస్తుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధించి సంస్థ కు తెలియజేయడం అదనంగా వసూలు చేసే వారి విషయంలో చర్యలు తీసుకోవడం పరిపాటి. కానీ అదనంగా వసూలు చేయడం మాత్రం ఆగడం లేదు. కొన్ని రోజులపాటు వసూళ్ల దందా ఆగినా తరువాత మామూలే అనే విధంగా తయారైంది. పౌరసరఫరాల శాఖ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ వీరే చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటం మొదటికే మోసం వస్తోంది. ప్రేమతో ఇస్తే డబ్బులు తీసుకోవాలి తప్పిస్తే డిమాండ్‌ చేసి వసూలు చేయడం నేరమే. కానీ ఇది పౌరసరఫరాల శాఖకు పెద్దగా నేరంగా కనిపించడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు హడావుడి చేయడం తరువాత మరిచిపోవడం మామూలైపోయింది. రంగారెడ్డి జిల్లాలో ప్రతినెల రూ. 2.70కోట్లు వసూలు చేస్తున్నారంటే వాటాలు వెళ్తాయనే ప్రచారం చాలాకాలంగా వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement