Tuesday, April 16, 2024

గ‌ల్లా అశోక్ చిత్రం ‘హీరో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవ‌రో తెలుసా

హీరో చిత్రంతో గ‌ల్లా అశోక్ వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్నాడు. ఫ‌స్ట్ మూవీతోనే సొంత బ్యాన‌ర్ ను ఏర్పాటు చేసుకొని మ‌రీ రంగంలోకి దిగుతున్నాడు అశోక్. కాగా ఈ చిత్రం ఈ నెల 15న థియేట‌ర్ లో విడుద‌ల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాగా రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్టుగా తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. మహేశ్ మేనల్లుడి ఫంక్షన్ కి చరణ్ వస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అశోక్ జోడీగా నిధి అగర్వాల్ సందడి చేయనుంది. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంద‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement