Monday, May 6, 2024

Fun day: జంగిల్ క్రూస్.. అడ్వెంచరస్ మూవీ..

తెలుగు డ‌బ్బుడు మూవీస్ లో అదిరిపోయే యాక్ష‌న్ అడ్వెంచ‌రస్ మూవీ ఇది.. చాలా రోజుల క్రితం రిలీజ్ అయినా.. డీస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో తెలుగులోనే స్ట్రీమింగ్‌లో ఉంది..

జంగిల్ క్రూస్..
డ్వెన్ జాన్సన్ అండ్ ఇమిలీ బ్లంట్ లీడ్ రోల్స్‌లో రీసెంట్ గా వ‌చ్చిన ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ మూవీ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని ఇస్తుంది. మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ క్యారెక్ట‌ర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవ‌టం.. ఇంకా వాస్ట్ స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. స్టోరీ విష‌యానికొస్తే.. అమెజాన్ అడ‌వుల్లో ఒక మిస్టీరియ‌స్ ప్లేస్‌లో చంద్ర‌బిందు అనే ఒక చెట్టు ఉంటుంది. అది అమృతంతో స‌మాన‌మ‌ని కొన్ని సంవ‌త్స‌రాల పూర్వం నుంచి అనుకుంటుంటారు. దీని కోసం డాక్ట‌ర్ లిల్లీ త‌న బ్ర‌ద‌ర్‌తోపాటు బోట్ డ్రైవ‌ర్ అయిన హీరో ఫ్రాంక్‌తో వెళ్ల‌డం.. వీళ్లు ఆ చెట్టుకోసం అడ్వెంచ‌ర‌స్ జ‌ర్నీ చుట్టూ మూవీ ఉంటుంది. ఈ జ‌ర్నీలో సాలిడ్ మెయిన్ క్యారెక్ట‌ర్స్ తో పాటు వేర్వేరు క్యారెక్ట‌ర్స్ కూడా వ‌స్తుంటాయి. అలాగే రైట్ ప్లేస్ లో యాక్ష‌న్ రావ‌టం ఇంకా కామెడీని అక్క‌డ‌క్క‌డా పెట్ట‌డం బాగా వ‌ర్క్ అవుట్ అయ్యాయి. విజువ‌ల్లీ స్పెక్టాక్యుల‌ర్‌గా థ్రిల్లింగ్ రైడ్‌తో మంచి అడ్వెంచ‌ర‌స్ మూవీ చూడాల‌నుకుంటే ఈ మూవీ త‌ప్ప‌క చూడొచ్చు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ర్టీమ్ అవుతోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement