Tuesday, April 30, 2024

Fun Day: #హోమ్.. ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా

ఈ సంవత్సరం మలయాలం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అంటే ఇదేనేమో. ఇప్పటి జనరేషన్ లో మొబైల్ ఎడిక్షన్, ఫ్యామిలీలోని మెంబర్స్ ని మెల్ల మెల్లగా ఎలా దూరం పెట్టగలుగుతుందో ఈ మూవీ తెలియజేస్తుంది. ఫోన్ లోనే మెస్సేజీలు, కాల్స్ ద్వారా కన్వర్జేషన్స్ కన్నా లైవ్ గా ఎదురుగా ఉన్నవాళ్లతో మాట్లాడితేనే కదా బాండ్ స్ర్టాంగ్ అయ్యేది.

మూవీ ప్లాట్ ఏంటంటే వలిబర్ ట్విస్ట్ తన ఫ్యామిలీలో ఇద్దరు సన్స్ టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్ తో ఎక్కువ గడపడం వల్ల ఫాదర్ కూడా ఫోన్ కొని అన్నీ నేర్చుకుని.. తన పిల్లలకు దగ్గరవుదామని అనుకుంటాడు. ఆ తర్వాత ఎట్లాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో మూవీలో చూసి ఎంజాయ్ చేయండి.

మంచి కాన్సెప్ట్ ని బ్యూటీఫుల్ గా ఒక మెస్సేజ్ తో కన్వే చేశారు. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. విజువల్ గా టాప్ క్లాస్. చాలా ఇళ్లల్లో జరిగే గ్రోన్ అప్ యూత్ విత్ మొబైల్ ఎడిక్షన్.. ఇంకా పేరెంట్స్, ఫ్యామిలీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని గురించి తెలియజేశారు ఈ మూవీలో.  మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఉంటాయి.

కొంచెం స్లో సెట్టింగ్స్ తో స్టార్ట్ అయినా కానీ, మిడ్ ఫస్ట్ ఆఫ్ నుంచి స్పీడందుకుని క్లైమాక్స్ చూశాక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశామన్న ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఫాదర్ గా చేసిన ఇంద్రన్స్ యాక్టింగ్ హైలైట్ గా ఉంటుంది. హ్యాష్ ట్యాగ్ హోమ్ అనే టైటిల్ కన్నా దీనికి మరో టైటిల్ అస్సలు సూట్ కాదని చెప్పవచ్చు. ఈ మూవీ చూశాక మీక్కూడా అదే అనిపిస్తుంది. మిస్ చేయకుండా చూడండి.. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ర్ట్రీమ్ అవుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement