Sunday, April 28, 2024

Fuel Prices: వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు చమరు సంస్థలు ఊరటనిచ్చాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరలకు బ్రేకులు వేశాయి. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. చమరు ధరలు నిలకడగా కొనసాగడం ఇది వరుసగా మూడో రోజు. హైదరాబాద్‌లో నేడు లీటరు  పెట్రోల్ ధర రూ.119.47గా, డీజిల్ రూ.105.47 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక, ఏపీలోని గుంటూరులో లీటరు పెట్రోల్ రేటు రూ.121.26 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.106.87 వద్ద నిలకడగా ఉంది. వాహనదారులకు ఇది కొంచెం ఉపశమనం కలిగించే అంశం. కాగా, మార్చి 22 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరిగాయి. 14 సవరణల తర్వాత ఇంధన ధరలు లీటర్‌కు రూ.10 పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement