Saturday, May 4, 2024

Petrol prices: భారీగా పెరిగిన చమరు ధరలు.. రూ.120కి చేరువైన పెట్రోల్‌ ధర

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు కొనసాగుతోంది. తాజాగా  లీటరుపై మరో 80 పైసల చొప్పున ధర పెంచుతున్నట్టు చమరు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41కు, లీటరు డీజిల్ ధర రూ.96.67కు చేరుకున్నాయి. ఇక, ముంబైలో పెట్రోల్, డీజిల్ పై 84 పైసలు పెరిగింది. దీంతో లీటరు ధర అక్కడ రూ.120.51కు చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.104.77కు పెరిగింది. ఇక, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120కి చేరువైంది. లీటరుపై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు మేర ధర పెరిగింది. దీంతో నగరంలో పెట్రోల్ రూ.119.49కి చేరింది.  డీజిల్ ధర రూ.105.49గా రికార్డయింది.ఇక ఏపీలోనూ పెట్రో ధరలు మండిపోతున్నాయి. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్‌పై ధర రూ.120.81కు చేరుకుంది. డీజిల్ ధర రూ.106.40కు ఎగసింది.

కాగా, ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చి 22 నుంచి మొదలైన ఈ బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత 15 రోజుల వ్యవధిలో పెట్రో ధరలు పెరుగడం పదమూడోసారి. మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.10.39, డీజిల్‌పై రూ.10.00 పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement