Friday, May 10, 2024

ఒక్క‌రోజుల్లో 765బంగీ జంప్స్ – గిన్సీస్ బుక్ రికార్డ్స్ సృష్టించిన ఫ్రాంకోయిస్ మారీ దిబాన్

బంగీ జంప్ చేయ‌డ‌మంటే పెద్ద సాహ‌స‌మ‌నే చెప్పాలి..ఒక్క‌సార చేయ‌డానికే ఎన్నోసార్లు ఆలోచిస్తుంటారు చాలామంది. అటువంటింది. ఒక్క రోజులో 765బంగీ జంప్స్ చేశాడు ఓ వ్య‌క్తి.అంటే గంటకు 31 సార్లు జంప్ చేసినట్లు లెక్క. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా చేశాడనుకోవాలి. ఫ్రాంకోయిస్ మారీ దిబాన్ దీన్ని సవాలుగా తిసుకున్నాడు. ఫ్రాన్స్‌కి చెందిన 44 ఏళ్ల ఫ్రాంకోయిస్… తన పేరును గిన్నీస్ బుక్‌లో రాయించుకున్నాడు. 24 గంటల్లో 765 సార్లు బంగీ జంప్ చేశాడు. స్కాంట్లాండ్, పిట్లోచ్రీ దగ్గర్లో ఉన్న గ్యారీ నదిపై ఉన్న వంతెన నుంచి కిందకు దూకాడు. ఇదివరకు న్యూజిలాండ్ బంగీ జంపర్ మైక్ హెర్డ్ పేరుతో 2017లో ఈ రికార్డు ఉండేది. అతను ఒక్క రోజులో 430 సార్లు జంప్ చేశాడు. ఇప్పటివరకూ దాన్ని ఎవరూ బీట్ చెయ్యలేదు. దాన్ని ఇప్పుడు ఫ్రాంకోయిస్ దాటేశాడు. తాజా రికార్డును గిన్నీస్ బుక్ రికార్డ్స్ అడ్జ్యుడికేటర్‌ నిర్ధారించారు. ఇక ఇప్పుడు ఫ్రాంకోయిస్ రికార్డును ఎవరైనా బ్రేక్ చెయ్యాలంటే… అతనికంటే వేగంగా బంగీజంప్ చెయ్యాల్సి ఉంటుంది అంటే నిమిషానికి 31 సార్లు కంటే ఎక్కువగా జంప్ చెయ్యాల్సి ఉంటుంది. అదేం తేలిక కాదు. ఒకసారి దూకాక… మళ్లీ పైకి రావాలి. మళ్లీ దూకాలి. ఇలా కంటిన్యూగా చెయ్యాలి. తాడు తెగిపోతుందేమో అనే భయమే ఉండకూడదు. అది ఉంటే… ఈ ఫీట్ చెయ్యలేరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement