Friday, July 12, 2024

ఆర్ ఆర్ ఆర్ పై విదేశీ మీడియా ప్ర‌శంస‌లు – ఆనందం వ్య‌క్తం చేసిన రాజ‌మౌళి

ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై అమెరికా ప్ర‌శంస‌లు కురిపించింది. ఈ సినిమాపై దేశీయ మీడియా మాత్రమే కాకుండా విదేశీ మీడియా కూడా ప్రశంసలు కురిపించింది. విదేశీ మీడియా స్పందన గురించి ద‌ర్శ‌కుడు రాజమౌళి మాట్లాడుతూ.. అమెరికా కూడా ఈ సినిమాను ప్రశంసిస్తుందని ఊహించలేదని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ తమ సినిమా గురించి రాసిందని… ఇది తనకు హార్ట్ టచింగ్ విషయమని చెప్పారు. అమెరికాలోని ప్రేక్షకులు కూడా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఆదరిస్తున్నారని అన్నారు. ‘బాహుబలి’కి జపాన్ నుంచి ప్రశంసలు వచ్చాయని, ‘ఆర్ఆర్ఆర్’కి యూఎస్ నుంచి కూడా వచ్చాయని చెప్పారు. ఏ సినిమాకైనా బాక్సాఫీస్ నంబర్లు చాలా ముఖ్యమైనవే అయినప్పటికీ… ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు కూడా చాలా ముఖ్యమైనవని రాజమౌళి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement