Thursday, May 9, 2024

బీహార్ లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఎఫ్ఐఆర్

భారత్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని పై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చెక్ బౌన్స్ అయిన కేసులో ధోని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ధోని.. టీమిండియా కెప్టెన్‌గా పనిచేసినప్పుడు బీహార్ కు చెందిన న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు ప్రమోటర్ గా ఉన్నాడు. ఇదొక ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేసే సంస్థ. ఎస్కే ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ.. న్యూఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 30 లక్షలు విలువ చేసే ఎరువులు కొనుగోలు చేసింది. న్యూఇండియా సంస్థ వాటిని డెలివరీ కూడా చేసింది.


అయితే ఈ ఎరువుల్లో నాణ్యత లోపం ఉందని, డీలర్ ప్రొవైడర్ కు అనుగుణంగా లేదని, వాటిలో చాలా వరకు అమ్ముడుపోలేదని ఎస్కే ఎంటర్ ప్రైజెస్ ఆరోపించింది. ఆ తర్వాత ధోని ప్రమోట్ చేసిన సంస్థ.. ఆ ఎరువులను వాపసు తీసుకుని, రూ.30 లక్షల చెక్కును ఏజెన్సీకి అందజేసింది. ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ కావడంతో సదరు సంస్థ న్యూఇండియా గ్లోబల్ సంస్థ కు ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరో ఏడుగురికి లీగల్ నోటీస్ పంపింది. తాజాగా వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement