Friday, April 26, 2024

కరోనా థర్డ్ వేవ్: 98 రోజులు ఉంటుందన్న ఎస్బీఐ నివేదిక

దేశాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ అతలాకుతలం చేసింది. అయితే, ఇప్పుడు కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా థర్డ్‌ వేవ్‌ కూడా ప్రస్తుతమున్న రెండో దశ లాగే ఉద్ధృతంగా ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆ నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా రెండో దశ సగటుగా 108 రోజులు ఉండనుందని, మూడో దశ 98 రోజులు ఉంటుందని ఎస్‌బీఐ నివేదికలో వివరించింది.

మూడో దశను ఎదుర్కొనేందుకు భారత్‌ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటే మరణాలు తక్కువగా నమోదవుతాయని అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం పెంచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల థర్డ్‌ వేవ్‌లో సీరియస్‌ కేసులను 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గించవచ్చిని తెలిపింది. సెకండ్ వేవ్‌లో ప్రస్తుతం మరణాల సంఖ్య 1.7 లక్షలు దాటింది. మౌలికసదుపాయాలను పెంచడం వల్ల మరణాల సంఖ్యను 40 వేలకే పరిమితం చేయొచ్చని నివేదిక తెలిపింది. కొవిడ్‌ మూడో దశ పిల్లలపైనే అధిక ప్రభావం చూపనుందని, వ్యాక్సిన్‌తో వారు కరోనా నుంచి రక్షణ పొందుతారని తెలిపింది.

దేశంలో 12-18 ఏళ్ళ వయస్సులో 15-17 కోట్ల మంది పిల్లలు ఉన్నారని పేర్కొంది. భారతదేశం ఈ వయస్సును టీకాలు వేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించిన వ్యూహాన్నే భారత్ దేశం కూడా అనుసరించాలని తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరానికి జిడిపి ప్రొజెక్షన్‌ను 10.4 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గినుందని వివరించింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం జూలై మధ్య నుండి రోజుకు ఒక కోటి టీకాలు వేయాలనే ఆలోచనతో ఉన్నట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: టీపీసీసీ చీఫ్ రేసులో నేనూ ఉన్నా: జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement