Friday, April 19, 2024

అందరం ఒకే మాటపై ఉందాం.. అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ

వాక్సినేషన్ కి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ ఒకే మాట మీద ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని ముఖ్యమంత్రి జగన్‌, సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో తెలిపారు. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్టు పరిస్థితి మారుతోందని చెప్పారు. కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి.. రాష్ట్రాలకు త్వరగా సరఫరా చేపట్టాలని సీఎం జగన్‌ కోరారు.

ఇదే అంశంపై మూడు రోజుల క్రితం బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేరళ సీఎం పినరయి విజయన్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. కేంద్రమే వ్యాక్సిన్లను సమకూర్చి రాష్ట్రాలకు ఉచితంగా అందించాలని తన లేఖలో సూచించారు. ఇందుకోసం బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటిగా చేరి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రస్తుత పరిస్థితిని తమ లాభపేక్ష కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని అందులో ఆరోపించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పలు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ కూడా లేఖను రాసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement