Thursday, February 22, 2024

ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు

ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో 13 మందికి గాయాలైన విషాద ఘటన పుణెలో చోటుచేసుకుంది. నాగ‌పూర్‌-పుణె హైవేపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడు మంది మృతిచెంద‌గా, మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. పుణె నుంచి మెహ‌క‌ర్ రూట్లూ బ‌స్సు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ట్ర‌క్కు ఆ బ‌స్సును ఢీకొట్టింది. గాయ‌ప‌డ్డ‌వారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిట‌ల్‌లో చేర్పించారు. రెండు వాహ‌నాలు ఎంత బ‌లంగా ఢీకొన్నాయంటే.. ఆ వెహికిల్స్ తుక్కుతుక్క‌య్యాయి. బ‌స్సు, ట్ర‌క్కుకు చెందిన గ్లాసు ప్యాన‌ల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement