Tuesday, April 16, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మహా నగరంలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.10 తగ్గి ప్రస్తుతం రూ. 56 వేల 290 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులానికి రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.61 వేల 410 వద్దకు వచ్చింది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.10 తగ్గి రూ.56 వేల 440 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.10 తగ్గి రూ.61 వేల 560 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తూ కాస్త దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు ఇవాళ రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.75 వేలకు దిగివచ్చింది. ఇక హైదరాబాద్ మహా నగరంలో కిలో సిల్వర్ రేటు రూ.400 తగ్గింది. ప్రస్తుతం కిలో రేటు 78 వేల 600లకు పడిపోయింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు, కమీషన్ల వంటివి కారణమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement