Tuesday, March 26, 2024

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు

వరి ధాన్యం కొనుగోళ్లులో జాప్యం కారణంగా అకాల వర్షానికి ధాన్యం నీటి పాలయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో రైతులు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల- కామారెడ్డి ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో పోసి అనేక రోజులు అవుతున్న ధాన్యం కొనుగోలు చేయుడంలో జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లకు అనేక ఆంక్షలు పెట్టడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల తీరుతో తమ ధాన్యం విక్తయించూ కోవడానికి తిప్పలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనను విరమించాలని స్థానిక పోలీసులు కోరారు. అయితే, రైతులు ఇందుకు నిరాకరించారు. జిల్లా కలెక్టర్, రెవిన్యూ, పౌర సరఫరా అధికారులు వచ్చి తమ ధాన్యం కొంటామనీ హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నష్ట  పోకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement