Friday, April 26, 2024

ముంచెత్తిన భారీ వ‌ర్షం.. గ్రామ‌స్తుల‌కు ర‌ఘునాథ‌రెడ్డి భ‌రోసా..

అనంతపురం, ప్రభన్యూస్ : అనుకోకుండా కురిసిన భారీ వర్షం కారణంగా చెరువుకట్ట పొంగి పొర్లి నేరుగా ఇంట్లోకి వరద దూసుకువచ్చేయ‌డంతో ఇళ్లువదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు గ్రామ ప్ర‌జ‌లు. మొత్తం వరదలో కొట్టుకుపోయింది. ఇదే గ్రామంలో ఇరవై దాకా పాత మిద్దెల్లోకి నీరు పోవడంతో వాటిలో కొన్ని పాక్షికంగా కూలిపోగా..మరికొన్ని కూలిపోయేదశకు చేరుకున్నాయి. తాము పుట్టినప్పటి నుంచి ఇటువంటి వరద చూడలేదని వృద్దులైన గ్రామస్తులు తెలిపారు. కేవలం ఇళ్లు,వాకిల్లే కాకుండా చేతికి వచ్చిన వరి ఇతర పంటలు వరదలో కొట్టుకుపోయి భారీగా ఆస్తినష్టం కలిగిందని ఆవేద‌న వ్యక్తంచేశారుగ్రామం మొత్తం చెరువు కట్ట కింద ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

చెరువువాండ్లపల్లి గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీనారాయణ రెండు ఎకరాల్లో వరిపంటను సాగు చేశాడు. ఇంటివద్ద వడ్ల గింజలను ఆరపెట్టుకోవడానికి స్థలం లేక దగ్గరలో ఉన్న కాజ్‌వే వద్ద వాటిని ఆరబోశాడు. ఒకసారిగా వచ్చిన వరదలో మొత్తం వడ్లలన్ని తడిసిపోవడంతో లక్ష్మీనారాయణ కంటతడిపెట్టాడు. తమను ఆదుకోవాలని విన్నవించాడు. ఇదే మండలంలో చాలా గ్రామాల్లో పాత మిద్దెలు, ఇల్లు వానలకు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవడానికి తగిన డబ్బులేక అందులోనే సంవత్సరాల తరబడికాలం వెళ్లతీస్తువస్తున్నారు

ఓబుళదేవరచెరువు, అమడగూరు, కొత్తచెర్వు,నల్లమాడ, పుట్టపర్తి తది తర మండలాల్లో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సంబంధించి అంచనావేయడంలో వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు మీనామేషాలను లెక్కపెడుతున్నారు. జిల్లా అధికారు స్పందించి క్షేత్రస్థాయిలో నష్టం అంచనాలను తయారు చేయాల్సిన అవసరం ఉందివ. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు కాస్తో ,కూస్తో సాయం చేస్తే ఓదార్చినట్లు అవుతుంది.

వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సందర్శించారు. నష్టపోయిన రైతులకు తనవంతు ఒక్కొక్కరి ఐదువేల రూపాయలు అందించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం గురించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. రైతుల పంట నష్టంగురించి వ్యవసాయ శాఖ జేడితో పోన్లో మాట్లాడారు. పరిహారం అందే విధంగా చూడాలని కోరారు. మొదట పంటనష్టం అంచనాలను క్షేత్రస్థాయిలో పర్యటించి రూపొందించాలని కోరారు. ఇదే విధంగా ఆస్తి,ఇతర నష్టాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. మంగళవారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వరద వచ్చిన‌ గ్రామాలను సందర్శించి బాధితులను ఓదార్చారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement