Thursday, April 25, 2024

Farm Laws: సాగు చట్టాలపై పోరు.. రైతుల ఉద్యమానికి ఏడాది

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తు రైతులు ఆందోళ‌నలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన మొదలు పెట్టారు. ఈ ఆందోళ‌నలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్, హ‌ర్యానా, పంజాబ్, ఉత్త‌రాఖండ తదితర రాష్ట్రాల నుంచి ల‌క్ష‌ల సంఖ్యలో రైతులు  ఆందోళ‌నలు చేశారు.

నేటికి ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఉద్య‌మ కాలంలో ఉద్య‌మంలో పాల్గొన్న 700 మంది రైతులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న‌వంబ‌ర్ 19న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మూడు సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయినా రైతులు త‌మ ఆందోళ‌నను విరమించ‌లేదు. పార్ల‌మెంటులో సాగు చ‌ట్టాల‌ను వెనక్కి తీసుకుంటున్న‌ట్టు బిల్లు పెట్టి ఆమోదించేంత వ‌ర‌కు ఉద్య‌మం ఆపేది లేద‌ని రైతు నాయ‌కులు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఢిల్లీలో సంయుక్త కిష‌న్ మోర్చ ఈ రోజు స‌మావేశం కానుంది. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల్లో ఆందోళ‌నలు చేయాల‌ని పిలుపు నిచ్చారు.

కాగా, ఈ నెల 29 నుంచి ప్రాంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. బిల్లు ఆమోదం తర్వాతే రైతులు తమ ఆందోళన విరమించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement