Monday, November 29, 2021

fire accident : అకస్మాత్తుగా కారులో మంటలు.. ప్రయాణీకుల పరిస్థితి ఏంటంటే…

ఓ కారులో ఉన్న‌ట్టుండి మంట‌లు వ‌చ్చాయి… డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తం కావ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నడుస్తున్న కారులో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం కాగా, తృటిలో తప్పింది పెను ప్రమాదం. ప్ర‌యాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో కారు వెళుతోంది.

అయితే ఆ కారు వెళ్తుండ‌గానే కారు ఇంజన్ లో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన కార్ డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. వెంటనే ప్రయాణికులు కారులోంచి బయటకు దిగారు. అయితే కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News