Friday, April 26, 2024

26/11 Mumbai attack: ముంబై మారణహోమానికి 13 ఏళ్లు!

ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 13 ఏళ్లు పూర్తయ్యింది. 2008 నవంబర్ 28 న ముంబాయిలో తీవ్రవాదుల దాడిలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిలో తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి..ఉగ్రవాదుల్ని ఎదుర్కొని..ఎందరివో ప్రాణాలు కాపాడిన వీరులున్నారు. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఉగ్రవాదుల కాల్పులకు బలైన అమాయకులు కళ్ల ముందు కన్పిస్తారు. ఈ ఘటన బాధితులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ దాడి ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబ సభ్యుల్ని తలచుకొని బాధపడుతున్నారు. అలాగే శత్రువులతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

పది మంది ఉగ్రవాదులు దేశంలో చొరబడి..ముంబైని టార్గెట్ గా చేసుకుని మారణహోమం సృష్టించారు. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్, నారిమన్ హౌస్ కాంప్లెక్స్, లియోపార్డ్ కేఫ్, తాజ్ హోటల్, తాజ్ టవర్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, కామా ఆసుపత్రుల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు.

హోటల్స్‌లో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకొని రెచ్చిపోయారు. లోపలి దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది. దాదాపు 60 గంటల సేపు సాగిన ఆపరేషన్ అనంతరం భద్రతాబలగాలు 9 మందిని కాల్చి చంపగా..ఒక టెర్రరిస్ట్ అజ్మల్ ఆమిర్ కసబ్ ను సజీవంగా పట్టుకున్నారు. అయితే ఈ ఆపరేషన్ లో ముష్కరుల్ని ఎదుర్కొని ఎందరినో రక్షించిన ఐదుగురు వీరులు ప్రాణాలు కోల్పోయారు. పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా.. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 మంది వరకు గాయపడ్డారు. ఈ దాడితో ముంబై నగరం భయంతో వణికిపోయింది. ఈ ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత 2012 నవంబరులో కసబ్‌ను ఎరవాడ జైలులో ఉరి తీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement