Friday, May 3, 2024

యువ‌తిపై న‌కిలీ బాబా దురాఘ‌తం.. వీడియోలు బ‌య‌ట‌పెడ‌తాన‌ని చీట్‌ చేస్తూ..

త‌న‌కు భగవంతుడి అవతారంగా ప్రచారం చేసుకుని భక్తుల చేత పూజలు అందుకుంటున్న ఓ న‌కిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. త‌న ఆశ్రమానికి వచ్చిన యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డి.. వీడియోలు తీసి చీటింగ్ చేస్తున్న కేసులో చెన్నైకి చెందిన స‌త్య‌నారాయ‌ణ‌న్ తోపాటు అఘాయిత్యాల‌కు స‌హ‌క‌రిస్తున్న అత‌ని భార్య పుష్ప‌ల‌త‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చాలాకాలంగా ఓ యువ‌తిపై అత్యాచారం చేయ‌డ‌మే కాకుండా ఆ పాడు పనిని వీడియోలు, ఫొటోలు తీసి బెదిరిస్తూ వస్తున్నారు. ఆ యువ‌తికి పెళ్లై పిల్లలు పుట్టినా బెదిరిస్తూనే ఆకృత్యాలు కొనసాగిస్తున్నారు. వేధింపులు భరించలేక బాధితురాలు చివరికి త‌న భర్త సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో అస‌లు విషయం బ‌య‌ట‌ప‌డింది..

చెన్నై సిటీకి చెందిన సత్యనారాయణన్ త‌న భార్య పుష్పలతతో కలిసి నగరంలోనే ‘షిర్డీ పురం సర్వ శక్తి పీఠం సాయి బాబా కోయిల్’ పేరుతో సొంతంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో విభూతి అయిపోవడంతో ఆశ్రమానికి వెళ్లి తీసుకురావాలని తన తాత పంపడంతో ఓ 16 ఏళ్ల బాలిక అక్కడికి వెళ్లింది. ఆ అమ్మాయిని చూసిన బాబా భార్య ఆమెకు ఓ జ్యూస్ ఇవ్వడంతో మత్తులోకి వెళ్లింది. కాసేపటికి తేరుకునే సరికి బెడ్ పై నగ్నంగా పడి ఉంది. తనకు ఓ వైపు బాబా మరో వైపు అతడి భార్య ఉండటంతో కంగారు పడింది. జరిగిన విషయం ఎవరితోనూ చెప్పవద్దని ఒక వేళ చెప్తే వీడియోలు బ‌య‌ట‌పెడ‌తామ‌ని బెదిరించారు. అలా తరచూ అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు ఆ న‌కిలీ బాబా..

ఈ క్రమంలో ఆమెకు పెళ్లైపోయింది. 2021 జనవరిలో బాధిత యువతి ఓ బాబుకి జన్మనిచ్చింది. గర్భం దాల్చడంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్న బాబా గత నవంబర్ నుండి తిరిగి వేధించడం ప్రారంభించాడు. ఆశ్రమానికి రావాలని బెదిరించసాగాడు. దీంతో జరిగిన విషయం భర్తకు చెప్పుకుంది ఆమె.. గల్ఫ్ లో ఉన్న తన భర్త సలహాతో పోలీసులను ఆశ్రయించడంతో ఫేక్ బాబాతో పాటు ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement