Monday, April 29, 2024

బ్రిటన్ అన్ లాక్.. మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం!

కరోనాతో విలవిలలాడిన బ్రిటన్‌లో ప్రస్తుతం వైరస్ అదుపులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా నిబంధనలను ఎత్తివేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుండడంతో ఈ నెల 19 నుంచి నిబంధనలను ఎత్తివేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. అయితే, ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మాస్కులు ధరించడాన్ని మాత్రం ప్రజల ఇష్టానికే వదిలేయనుంది. ఆంక్షల ఎత్తివేతకు సంబంధించి వచ్చే వారం ప్రధాని బోరిస్ ప్రకటించే అవకాశం ఉంది.

కరోనా నిబంధనలు ఎత్తివేసేందుకు, తిరిగి సాధారణ జీవనం సాగించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి తెలిపారు. వైరస్‌తో కలిసి జీవించే ఒక విభిన్న కాలానికి మనమంతా వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ ఆంక్షలు లేని కాలానికి మనమంతా వెళ్తున్నామని, అయితే ప్రజలేం చేయాలో ప్రభుత్వం చెప్పదని అన్నారు.

ఇది కూడా చదవండి:అధికారుల తీరుపై కేసీఆర్ అసహనం.. రిబ్బన్‌ను పీకి పడేసిన సీఎం!

Advertisement

తాజా వార్తలు

Advertisement