Monday, April 29, 2024

కాలా ఛ‌స్మా సాంగ్ కి అదిరిపోయే స్టేప్పులేసిన ఆఫ్రిక‌న్ పిల్ల‌లు-సూప‌ర్ అని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

కాలా ఛ‌స్మా సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేశారు ఆఫ్రిక‌న్ పిల్ల‌లు.లిరిక్‌కు, మ్యూజిక్‌కు త‌గ్గట్టుగా స్టెప్పులేయ‌డంతో ఆ ఆఫ్రిక‌న్స్ డ్యాన్స్‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను ఐఏఎఫ్ రిటైర్డ్ ఎయిర్ మార్ష‌ల్ ఏవియేట‌ర్ అనిల్ చోప్రా షేర్ చేయ‌గా.. దాన్ని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. త‌ప్ప‌కుండా ఆ పిల్ల‌లు ఎదుగుతార‌ని, వారి ముఖాల్లో చిరున‌వ్వు ఉంటుంద‌ని కేటీఆర్ తెలిపారు. ఆఫ్రిక‌న్స్ అద్భుతంగా డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టార‌ని కేటీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న మ‌న‌సుకు న‌చ్చిన క‌థ‌నాల‌ను, వీడియోల‌ను షేర్ చేస్తూ వారిని అభినందింస్తుంటారు. ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement