Saturday, May 4, 2024

ఉత్త‌రాదిన‌ చ‌లిగాలుల తీవ్ర‌త‌.. ఢిల్లీలో అతి త‌క్కువ టెంప‌రేచ‌ర్లు.. ఉత్త‌రాఖండ్‌కి ఎల్లో అలర్ట్..

ఉత్తర భారతదేశాన్ని చిల‌గాలులు వ‌ణికిస్తున్నాయి. అతి త‌క్కువ స్థాయిలో ఉష్ణోగ్ర‌త్త‌లు న‌మోద‌వుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. శ‌నివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అతి త‌క్కువ ఉష్ణోగ్రత అని ఐఎండీ తెలిపింది.. కాగా, మ‌ధ్యాహ్నం వేళ 20 డిగ్రీల ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌వుతున్నాయ‌ని, పొద్దంతా పొగ‌మంచు కురుస్తూనే ఉంద‌ని పేర్కొంది.

అయితే ఈ సిజ‌న్‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే రెండు డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయని, ఇది చిన్న‌ పిల్ల‌లు, ఓల్డ్ ఏజ్ పీపుల్ హెల్త్‌పై చాలా ప్ర‌భావం చూపుతుంద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. అంతేకాకుండా ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్‌.. రాజ‌స్థాన్‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌ని ప్ర‌క‌టించింది ఐఎండి.

గ‌త సీజ‌న్ల కంటే ఈసారి పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే గణనీయంగా త‌గ్గిపోయింది. ఇక్కడ చలి గాలులు కూడా ఎక్కువ‌గానే వీస్తున్నాయి. ఇట్లా డిసెంబరు 21 వరకు పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగానే ఉండే ప‌రిస్థితులున్నాయ‌ని ఐఎండీ అంచనావేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement