Monday, May 6, 2024

ఉస్మానియా పరిధిలో వివిధ కోర్సుల పరీక్ష తేదీల ఖరారు..

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్ ఇవ్వాల తెలిపారు. అన్ని పీజీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలను ఈ నెల 10వ తేదీ నుంచి, పీజీడీసీఏ మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌, రెండో సెమిస్టర్‌ మెయిన్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈ నెల 12వ తేదీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌ (పీజీడీసీఏ) మొదటి సెమిస్టర్‌ మెయిన్‌, బ్యాక్‌లాగ్‌, రెండో సెమిస్టర్‌ సప్లమెంటరీ పరీక్షలను.. ఈ నెల 17వ తేదీ నుంచి, దూరవిద్యా కేంద్రమైన పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా అందించే డిగ్రీ కోర్సుల మొదటి, రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూడొచ్చాన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement