Friday, May 10, 2024

ఫ్రాన్స్ అధ్య‌క్షుడిపై ట‌మాటాలు విసిరిన దుండ‌గుడు – వైర‌ల్ గా వీడియో

రెండవ‌సారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ఫ‌స్ట్ టైం ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మ‌క్రాన్. .ఈ సందర్భంగా ఆయనను అభినందించడానికి ఫ్రాన్స్ ప్రజలు ఆయన్ను చుట్టుముట్టారు.ఈ క్రమంలో ఆయన వారితో మాట్లాడుతుండగా..కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై టమాటాలు విసిరారు.వెంటనే అప్రమత్తమైన మక్రాన్ సెక్యూరిటీ సిబ్బంది..ఆయనను చుట్టూ చేరి రక్షణ వలయంగా మారారు.అనంతరం మాక్రాన్ ను అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లుు కొడుతుంది.ఇక 2017 లో జరిగిన ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.మళ్లీ 2022 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి మారిన్ లె పెన్ పై విజయం సాధించి మాక్రాన్ రెండవ సారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement